Abn logo
Feb 13 2020 @ 07:56AM

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి రెడీ.. శిక్షణ కోసం..!

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞకు సినిమాలపై పెద్దగా ఇంట్రస్ట్ లేదని, బిజినెస్ వైపు వెళ్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది. నటనలో శిక్షణ కోసం మోక్షజ్ఞ న్యూయార్క్ వెళ్తున్నట్లు సమాచారం. న్యూయార్క్ ఫిల్మ్ అండ్ థియేటర్ ఇనిస్టిట్యూట్‌లో 12 వారాల పాటు ఆయన శిక్షణ తీసుకోనున్నారట. శిక్షణ తర్వాత ఓ క్రేజీ డైరెక్టర్.. మోక్షజ్ఞతో సినిమా చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నందమూరి ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని  సినిమా చేస్తారని సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement