Abn logo
Jun 6 2020 @ 22:19PM

చిన్నప్పటి నుంచి చదువుపై శ్రద్ధ లేదు: బాలకృష్ణ

చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి లేదని నందమూరి బాలకృష్ణ తెలిపారు. జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎక్ల్సూజివ్ ఇంటర్వ్యూ  నిర్వహించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘నాకు చిన్నపటి నుంచి సినిమాలంటేనే ఇష్టం. చదువుపై శ్రద్ధ లేదు. ఇంటర్ తర్వాత  నాన్న చెప్పారని మెడికల్ ఎంట్రన్స్‌కు అప్లై చేశా. నాకు హాల్ టికెట్ రాదు అనుకున్నా. కానీ హాల్ టికెట్ వచ్చింది.  ప్రిపేర్ కాకుండా ఎగ్జామ్ రాశాను. సీటు రాదు అనుకున్నా.. అలాగే జరిగింది. సినిమాలకు కొంచెం విరామం ఇచ్చి బీఏ చదివా. అందువల్లే ఎక్కువ సినిమాలు చేయలేకపోయా. నేను చేసిన 100 సినిమాలు పెద్ద లెక్క కాదు. సినిమాల జయాపజయాలు మామూలే. కొన్ని సినిమాలు హిట్ అవుతాయకున్నవి ఫ్లాప్ అయ్యాయి. ఆడవు అనుకున్న సినిమాలు హిట్ అయ్యాయి.’’ అని అన్నారు.

Advertisement
Advertisement
Advertisement