అమెరికాలో ఘ‌నంగా బాలయ్య‌ 60వ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2020-06-10T18:36:53+05:30 IST

నడకలో, నడతలో సింహం ... సేవలో వినయం, వినమ్రత. మిగతా హీరోలకు అభిమానులు, ఇష్టపడే అనుచరులు ఉండొచ్చు... కానీ నందమూరి బాలకృష్ణకు మాత్రమే ప్రాణమిచ్చే అభిమానులు, పడిచచ్చే అనుచరులు ఉంటారు.

అమెరికాలో ఘ‌నంగా బాలయ్య‌ 60వ జన్మదిన వేడుకలు

అమెరికాలో ఘనంగా NBK@60 బ‌ర్త్‌డే సెలబ్రేషన్స్- 60 నగరాలు, 60 కేకులు

నడకలో, నడతలో సింహం ... సేవలో వినయం, వినమ్రత.  మిగతా హీరోలకు అభిమానులు, ఇష్టపడే అనుచరులు ఉండొచ్చు... కానీ నందమూరి బాలకృష్ణకు మాత్రమే ప్రాణమిచ్చే అభిమానులు, పడిచచ్చే అనుచరులు ఉంటారు. బాలయ్య కోపం తాత్కాలికం... బాలయ్య ప్రేమ శాశ్వతం. అందుకే ప్రపంచంలో వారికి ఆయన పేరు అంటే మోజు, మాట వింటే ఊపు.


ఇలాంటి అభిమానులను ఒక్కటి చేస్తే ఎలా ఉంటుంది... అన్న ఆలోచనతో ప్రముఖ ఎన్నారై కోమటి జయరాం చేసిన ఒక చక్కటి ప్రయత్నం అగ్ర‌రాజ్యంలో విజయవంతం అయ్యింది. బాల‌య్య 60వ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఆయ‌న‌ అభిమానులు అమెరికాలోని 60 నగరాల్లో 60 కేకులు కట్ చేసి వైవిధ్యంగా బాలయ్య పుట్టిన రోజును వేడుకగా నిర్వహించారు. 


ఈ సందర్భంగా కోమటి జయరాం మాట్లాడుతూ...  బే ఏరియాతో బాలయ్యకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఇక్కడ గతంలో రెండు సార్లు నందమూరి బాలకృష్ణ తన పుట్టిన రోజును మనందరితో ప్రత్యక్షంగా ఘనంగా జరుపుకున్నారని ఆయ‌న గుర్తు చేశారు. ఈ 60వ పుట్టిన రోజును కూడా అమెరికా ప్రభుత్వ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ ఘనంగా జరుపుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఇదో కొత్త అనుభూతి అని ఆయన వ్యాఖ్యానించారు. చివరి నిమిషం సమాచారంతో ఇంత మంది బాలయ్య అభిమానులు ఏకమై ఆయా నగరాల్లో  పుట్టిన రోజు వేడుకలకు పెద్ద ఎత్తున హాజరుకావడం అభినందనీయమన్నారు. ఎక్కడా నిబంధనలు తప్పకుండా తమ అభిమానాన్ని చాటుకుని వేడుకల్లో పాల్గొన్న వారిని కోమటి జయరాం ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - 2020-06-10T18:36:53+05:30 IST