Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 8 2021 @ 07:30AM

మరో వివాదంలో సీఎం తండ్రి... ఇన్‌స్పెక్టర్ టేబుల్‌పై ఆహారం తింటూ...

రాయపూర్: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ తండ్రి నందకుమార్ బఘెల్ బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు నందకుమార్ బఘెల్‌కు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నందకుమార్ బఘెల్‌ను అరెస్టు చేసిన పోలీసులు అనంతరం అతనిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

అక్కడ పోలీసులు నందకుమార్ బఘెల్‌‌ను ఇన్‌స్పెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టి, ఆ హార పానీయాలు అందించారు. ఈ సమయంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నందకుమార్ కుర్చీలో కూర్చుని, టేబుల్‌పై ఉన్న ఆహారాన్ని తింటుండటం ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని చూసిన కొందరు యూజర్లు విమర్శలు చేస్తుండగా, మరికొందరు నందకుమార్ వయనును దృష్టిలో ఉంచుకుని అలా గౌరవించడం సబబేనని సమర్థిస్తున్నారు. బ్రాహ్మణ సంఘం ఫిర్యాదు మేరకు నంద్‌కుమార్‌ బఘెల్‌ను అరెస్టు చేసిన పోలీసులు... ఆ తరువాత అతనిని కోర్టులో హాజరుపరిచారు. రాయ్‌పూర్ కోర్టు నంద్‌కుమార్‌ బఘెల్‌కు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Advertisement
Advertisement