Nancy Pelosi: ఉద్రిక్తతల మధ్య తైపేయిలో ల్యాండ్ అయిన నాన్సీ పెలోసీ

ABN , First Publish Date - 2022-08-03T02:36:38+05:30 IST

పరస్పర హెచ్చరికలు, సవాళ్ల మధ్య అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీని మోసుకొస్తున్న విమానం

Nancy Pelosi: ఉద్రిక్తతల మధ్య తైపేయిలో ల్యాండ్ అయిన నాన్సీ పెలోసీ

తైవాన్: పరస్పర హెచ్చరికలు, సవాళ్ల మధ్య అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ (Nancy Pelosi)ని మోసుకొస్తున్న విమానం తైవాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఆ వెంటనే తైపేయిలో ఆమె ల్యాండయ్యారు. తైవాన్‌ను తమ భూభాగంలోని భాగంగానే పరిగణిస్తున్న చైనా.. పెలోసీని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. పెలోసీ కనుక తైవాన్‌(Taiwan)లో అడుగుపెడితే అది రెచ్చగొట్టే చర్చే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.


అంతేకాదు, పెలోసీ కనుక తైవాన్‌లో అడుగుపెడితే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పెలోసీ తైవాన్‌లో అడుగుపెట్టడంతో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. మరోవైపు, చైనా ఆరు ప్రాంతాల్లో మిలటరీ డ్రిల్స్ నిర్వహించడం ఉద్రిక్తతను మరింత పెంచింది. 

Updated Date - 2022-08-03T02:36:38+05:30 IST