Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 19 Aug 2022 17:41:59 IST

Namrata shirodkar: వినూత్న నిర్ణయం!

twitter-iconwatsapp-iconfb-icon

నమ్రతా శిరోద్కర్‌ (Namratha sirodkar)ఎప్పుడూ బిజీగానే ఉంటారు. ఇల్లు, పిల్లలు, వారి చదువులు, మహేశ్‌ సినిమాలకు సంబంధించిన పనులు ఇలా అనుక్షణంగా బిజీగానే ఉంటారు. ప్రస్తుతం ఆమె వినూత్న ప్రయత్నం చేయనున్నారు. టీవీరంగంలో అడుగుపెట్టి కొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల్ని అలరించాలనుకుంటున్నారు. దీనికి సంబంధించిన పనులు బిజీగా ఉన్నారు నమ్రత. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి, ఆమె ఆడపడుచు మంజుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సినిమాలకు దూరం కావడం వల్ల ఎలాంటి రిగ్రెట్స్‌ లేవని చెప్పారు. 


‘‘నేను చేసిన సినిమాలన్నీ నాకున్న పరిధిలోనే చేశాను. జీవితం ఇలా ఉండాలి అని నేనెప్పుడు ప్లాన్‌ చేసుకోలేదు. పెద్దగా కలలు కూడా కనలేదు. జీవితం ఎలా నడిపిస్తే అలా సాగానంతే. నిజం చెప్పాలంటే నేను ఎయిర్‌  హోస్టెస్‌ కావాలనుకున్నా. ప్రమాదాలు జరుగుతాయని అమ్మ భయపడింది. అందుకే అటువైపు వెళ్లలేదు. సినిమాలకు దూరం కావడం వల్ల కూడా నాకు బాధ లేదు. అంత కన్నా అందమైన ఫ్యామిలీ బాధ్యత మోస్తునందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం యాక్టింగ్‌ చేసే ఆలోచన లేదు. నాకు ఖాళీగా కూర్చుంటే బోర్‌ కొడుతుంది. అందుకే ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటా. ఇప్పుడు టీవీ రంగానికి సంబంధించి ప్రొడ్యూసింగ్‌ కంపెనీ స్టార్ట్‌ చేశా. దాని నుంచి మంచి కంటెంట్‌ ప్రేక్షకులకు అందించాలనుంది. ఆ పనుల్లో బిజీగా ఉన్నా. పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కాబట్టి నాకు కూడా కాస్త తీరిక దొరికింది’’ అని తెలిపారు. 

Namrata shirodkar: వినూత్న నిర్ణయం!

మంజుల బెస్ట్‌ ఫ్రెండ్‌...

ఓ పార్టీలో అనుకోకుండా మంజులను(manjula) కలిశాను. అప్పటికీ నేను మహేశ్‌ (Mahesh babu)లవ్‌లో ఉన్నట్లు తెలీదు. ఆ తర్వాత ఇద్దరం ఒక ఇంటివాళ్లయ్యాం. అంతే కాదు మేమిద్దం ఒకేసారి గర్భం దాల్చాం. అది యాదృచ్ఛికంగా జరిగింది. నిజానికి మంజులకు పిల్లలను కనడం ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఓ కూతురుని కని తల్లిగా ఆమె ఎంతో ఆనందంగా ఉంది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement