గణనాథా నమోస్తుతే!

ABN , First Publish Date - 2020-08-22T06:20:10+05:30 IST

కరోనా భయం ఇంకా తొలగిపోలేదు. అందుకే ఈసారి ఏకదంతుణ్ణి ఇంట్లోనే పూజిద్దాం. పర్యావరణ హితమైన

గణనాథా నమోస్తుతే!

కరోనా భయం ఇంకా తొలగిపోలేదు. అందుకే ఈసారి ఏకదంతుణ్ణి ఇంట్లోనే పూజిద్దాం. పర్యావరణ హితమైన విగ్రహం పెట్టి విఘ్నాలను తొలగించమని ప్రార్థిద్దాం.


  1.  ఈ రోజు వినాయకచవితి. కాబట్టి ఉదయాన్నే తలస్నానం చేయండి. పూజకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేయడంలో ఇంట్లో సహాయపడండి. 
  2.  గణనాథునికి 21 రకాల పత్రితో పూజ చేస్తారు. ఆ పత్రి పేర్లు ఏంటో తెలుసుకోండి. అవన్నీ పూజకు రెడీ చేయండి. పూజ సమయంలో మీ పుస్తకాలు కూడా గణనాథుని చెంత ఉంచండి. 
  3.  ఏ పూజ చేసినా ముందు గణపతిని పూజిస్తారు. విఘ్నాలు తొలగించమని ప్రార్థిస్తారు. కాబట్టి మీరూ చదువులో విఘ్నాలు తొలగించమని ప్రార్థించండి. 
  4.  ఏకదంతుడు జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడు కాబట్టి బాగా చదువుకోవాలని, మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకోండి.
  5.  గణనాథున్ని 108 రకాల పేర్లతో కొలుస్తారు. ‘మూషిక వాహన’, ‘వక్రతుండ’, ‘గజానన’.. అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆ పేర్లను పఠిస్తూ పూజ చేయండి. 

Updated Date - 2020-08-22T06:20:10+05:30 IST