నామినేషన్‌ సెంటర్ల పరిశీలన

ABN , First Publish Date - 2021-04-17T05:51:27+05:30 IST

నామినేషన్‌ సెంటర్ల పరిశీలన

నామినేషన్‌ సెంటర్ల పరిశీలన
మీడియా సెంటర్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు

వరంగల్‌ సిటీ, ఏప్రిల్‌ 16 :  జిల్లా ఎన్నికల అధికారి, అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంఽధీ హన్మంతు జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతితో కలిసి నామినేషన్‌ సెంటర్లు ఎల్‌బీ కళాశాల, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలను పరిశీలించారు. డీపీఆర్‌వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. మెప్మా కార్యాలయంలో మీడియా సెల్‌ను కమిషనర్‌ పమేలా సత్పతి ప్రారంభించారు. ఎల్‌బీ కళాశాల, ఆర్ట్స్‌ కళాశాలలోనూ మీడియా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నామినేషన్ల సెంటర్లలో నామినేషన్ల దాఖలు, ఫీజులు చెల్లింపు, రిటర్నింగ్‌ అధికారుల బాధ్యతల నిర్వహణ తదితర అంశాలను రాజీవ్‌గాంధీ హన్మంతు పరిశీలించారు. పకడ్బందీగా విధులు నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లు జరిగినా రిటర్నింగ్‌ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరగకుండా అభ్యర్థులు సహకరించాలన్నారు. ఎన్నికల కమిషన్‌ నియమావళిని పాటించాలని సూచించారు. 

పోలింగ్‌ సెంటర్లకు నెంబర్లు

ఎన్నికల కోసం గుర్తించిన 878 పోలింగ్‌ సెంటర్లకు నెంబర్లు వేసే ప్రక్రియను టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చేపట్టారు. పోలింగ్‌ సెంటర్లలో దివ్యాంగులకు అనువుగా నిర్మాణాలు, సపోర్టు రెయిలింగ్‌, వీల్‌ చైర్లు తదితర ఏర్పాట్లపై ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు సమస్యాత్మక సెంటర్లను గుర్తించి భద్రతా ఏర్పాట్లపై అధికారులు సమీక్ష జరిపారు. ప్రచారం, ర్యాలీలు, రోడ్‌ షోలు, సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల పొందేందుకు సువిధ సెంటర్‌ను మెప్మా కార్యాలయంలో ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-04-17T05:51:27+05:30 IST