Advertisement
Advertisement
Abn logo
Advertisement

నమీబియాకు భారీ టార్గెట్ నిర్దేశించిన ఆఫ్ఘనిస్థాన్

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్లు హజ్రతుల్లా జాజాయ్ (33), మహమ్మద్ షాజాద్ (45) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అస్ఘర్ అఫ్ఘాన్ 31, కెప్టెన్ మహ్మద్ నబీ 32 (నాటౌట్) పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపెల్‌మన్, జాన్ నికోల్ లోఫ్టీ ఈటన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, జేజే స్మిత్ ఒక్క వికెట్ తీసుకున్నాడు.

Advertisement
Advertisement