ఇమ్రాన్ అనుచరులు దేశం విడిచి వెళ్లకుండా నిషేధం

ABN , First Publish Date - 2022-04-11T22:20:35+05:30 IST

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అనుచరులు దేశం వదిలివెళ్లకుండా నిషేధం విధించింది ఎఫ్ఐఏ (ద ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ). ఎఫ్ఐఏ పాకిస్తాన్‌కు చెందిన అత్యున్నత విచారణ సంస్థ.

ఇమ్రాన్ అనుచరులు దేశం విడిచి వెళ్లకుండా నిషేధం

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అనుచరులు దేశం వదిలివెళ్లకుండా నిషేధం విధించింది ఎఫ్ఐఏ (ద ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ). ఎఫ్ఐఏ పాకిస్తాన్‌కు చెందిన అత్యున్నత విచారణ సంస్థ. ఎవరైనా పాకిస్తాన్ విడిచి వెళ్లకూడదంటే వారి పేర్లను ‘స్టాప్ లిస్ట్’లో చేరుస్తుంది ఎఫ్ఐఏ. తాజాగా ఇమ్రాన్‌ఖాన్ అనుచరులు ఆరుగురి పేర్లను ఈ లిస్టులో చేర్చింది. ఇమ్రాన్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అజామ్ ఖాన్, స్పెషల్ అసిస్టెంట్ షాబాజ్ గిల్, సలహాదారు షాజాబ్ అక్బర్‌తోపాటు మరో ముగ్గురి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పేరును కూడా ఈ జాబితాలో చేర్చాలంటూ పిటిషన్ దాఖలైంది.

Updated Date - 2022-04-11T22:20:35+05:30 IST