ప్రపంచంలో టాప్‌లో ఉంటూ అందరికీ షాక్ ఇస్తున్న పేరు ఏది? మన దేశంలో రాముడి పేరు టాప్‌లో లేదెందుకు?

ABN , First Publish Date - 2021-10-29T12:43:30+05:30 IST

దాదాపు 7.9(2021) బిలియన్ల జనాభా కలిగిన..

ప్రపంచంలో టాప్‌లో ఉంటూ అందరికీ షాక్ ఇస్తున్న పేరు ఏది? మన దేశంలో రాముడి పేరు టాప్‌లో లేదెందుకు?

దాదాపు 7.9(2021) బిలియన్ల జనాభా కలిగిన ఈ ప్రపంచంలో ఏ పేరు కలిగినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకక.. మీరు కాసేపు మీ తల గోక్కునివుంటారు. తరువాత ఏదో ఒక సమాధానం చెబుతారు. అది అవునా కాదా అనే ఆలోచనలో పడతారు. అందుకే దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచం మొత్తం మీద జియాన్‌షెంగ్(Xiansheng) అనే పేరుగల వ్యక్తులు గరిష్ట సంఖ్యలో ఉన్నారు. ఈ చైనీస్ పేరుకు అర్థం భర్త, అలాగే సర్ లేదా మిస్టర్ అని కూడా అర్థం ఉంది. forebears.io వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి 67 మంది వ్యక్తులలో ఒకరి పేరు జియాన్‌షెంగ్. ఈ పేరు కలిగిన వ్యక్తుల సంఖ్య 10,8,118,954. 


ఇక రెండో స్థానంలో మారియా పేరు ఉంది. ఈ పేరుతో ప్రపంచంలో మొత్తం 61,147,219 మంది స్త్రీలు ఉన్నారు. మూడవ స్థానంలోనూ ఒక చైనీస్ పేరు ఉంది. అదే జియాజీ(Xiaojie). ప్రపంచంలో ఈ పేరు కలిగిన మహిళలు 51,857,868 మంది ఉన్నారు. అంటే, ప్రతి 141 మంది స్త్రీలో ఒకరికి Xiaojie అనే పేరు ఉంది. నూషి నాల్గవ స్థానంలో, మహమ్మద్ ఐదవ స్థానంలో, జోష్ ఆరవ స్థానంలో ఉన్నారు. ఇక మనదేశం విషయానికొస్తే  శ్రీ అనే పేరు మొదటి స్థానంలో ఉంది. ఇది ప్రపంచ జాబితాలో 45వ స్థానంలో ఉంది. ఈ పేరుతో 64 లక్షల 73 వేల 133 మంది ఉన్నారు. రెండవ సంఖ్య రాముని పేరు. ఈ పేరుతో ఉన్న వారి సంఖ్య 57 లక్షల 43 వేల 57. అంటే ప్రతి 1,269 మందిలో ఒకరి పేరు రామ్. ఇది మొత్తం ర్యాంకింగ్‌లో 58వ స్థానంలో ఉంది. ఓవరాల్ ర్యాంకింగ్‌లో 63వ స్థానంలో ఉన్న అనిత.. అత్యంత ప్రజాదరణ పొందిన పేరు. ప్రపంచంలో అనిత అనే పేరు కలిగినవారి సంఖ్య 54 లక్షల 79 వేల 91. ఆ తరువాతి స్థానంలో రీటా పేరు వస్తుంది. ఇది ఈ జాబితాలో 75వ స్థానంలో ఉంది. రీటా పేరు కలిగినవారి సంఖ్య 46 లక్షల 42 వేల 146. టాప్ 100 పేర్లలో సునీత పేరుకు కూడా చోటు దక్కింది. 85వ స్థానంలో సునీత పేరు ఉంది. ఈ పేరు కలిగిన మహిళలు 41 లక్షల 10 వేల 579 మంది ఉన్నారు.

Updated Date - 2021-10-29T12:43:30+05:30 IST