పేరు మార్చి ఎన్టీఆర్‌ స్థాయిని తగ్గించలేరు: జూనియర్‌ ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-09-23T08:27:18+05:30 IST

పేరు మార్చి ఎన్టీఆర్‌ స్థాయిని తగ్గించలేరు: జూనియర్‌ ఎన్టీఆర్‌

పేరు మార్చి ఎన్టీఆర్‌ స్థాయిని తగ్గించలేరు: జూనియర్‌ ఎన్టీఆర్‌

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ ఆరోగ్య వైద్య విశ్వ విద్యాలయం పేరును మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు. ‘‘ఎన్‌టీఆర్‌, వైఎ్‌సఆర్‌ ఇద్దరూ విశేష ప్రజాదరణ ఉన్న గొప్ప నాయకులు. ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎ్‌సఆర్‌ స్థాయిని పెంచదు, ఎన్‌టీఆర్‌ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్‌టీఆర్‌ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేదు’’ అని ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2022-09-23T08:27:18+05:30 IST