నమక్‌ పరె

ABN , First Publish Date - 2021-03-27T19:14:24+05:30 IST

గోధుమపిండి - రెండు కప్పులు, రవ్వ - రెండు టేబుల్‌స్పూన్లు, వాము - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.

నమక్‌ పరె

కావలసినవి: గోధుమపిండి - రెండు కప్పులు, రవ్వ - రెండు టేబుల్‌స్పూన్లు, వాము - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం: ఒక పాత్రలో గోధుమపిండి తీసుకుని అందులో రవ్వ, వాము, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్న నూనెను పిండిపై పోయాలి. అంతటా పట్టేలా బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. అవసరాన్ని బట్టి నీళ్లు పోస్తూ కలపాలి. తరువాత మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ బాల్స్‌లా చేసుకోవాలి. పొడి పిండి అద్దుకుంటూ చపాతీలా చేయాలి. అయితే కొద్దిగా మందంగా ఉండేలా చేసుకోవాలి. కత్తి సాయంతో నచ్చిన ఆకారాల్లో కట్‌ చేయాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక నమక్‌ పరెలు వేసి వేగించాలి. చిన్నమంటపై గోధుమరంగులోకి మారే వరకు వేగించి తీసుకోవాలి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి భద్రపరుచుకుని స్నాక్స్‌గా తినొచ్చు.


Updated Date - 2021-03-27T19:14:24+05:30 IST