వైభవంగా నల్లవీరగంగాభవానీ జాతర

ABN , First Publish Date - 2022-05-16T05:35:25+05:30 IST

వాల్మీకిపురం పట్టణం వానరగుట్ట ప్రాంతంలో వెలసిన నల్లవీరగంగాభవానీ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా నల్లవీరగంగాభవానీ జాతర
వాల్మీకిపురంలో గంగరాళ్లకు జలాభిషేకం చేస్తున్న మహిళలు

వాల్మీకిపురం, మే 15: వాల్మీకిపురం పట్టణం వానరగుట్ట ప్రాంతంలో వెలసిన నల్లవీరగంగాభవానీ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో అమ్మవారికి అభిషేకం, అర్చన, విశేష అలంకరణలతో పూజలు జరిగాయి. మహిళలు గంగాజలాలతో ప్రదర్శనగా వెళ్లి గంగరాళ్లకు జలాభిషేకం నిర్వహించా రు. పట్టణ ప్రజలు, సమీప గ్రామాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి దీలు, బోణాలు సమర్పించి పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రాత్రికి అమ్మవారికి ఊంజల్‌సేవ, సింహవాహనంపై పురవీధులలో నగరోత్సవం వైభవంగా సాగింది. అలాగే బైపాస్‌ రోడ్డులోని కనుమలో గంగమ్మ దేవత ఆలయం, పునుగుపల్లెలోని అమ్మవారి ఆలయాల్లో జాతర మహోత్సవాలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. కార్యక్రమాలలో ఆలయ ధర్మకర్త రమణారెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్‌ మొర్రం రెడ్డిరామ్‌కుమార్‌రెడ్డి, సభ్యులు బలరామ్‌, విజయ్‌కుమార్‌వర్మ, భక్తులు పాల్గొన్నారు. 

తంబళ్లపల్లెలో ముత్యాలమ్మ తిరుణాల

తంబళ్లపల్లె, మే 15: మండలంలోని కోసువారిపల్లెలో వెలసిన ముత్యాలమ్మ తిరుణాల ఆదివారం గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.  ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి దర్శించుకుని దీలూ, బోణాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం గంధము, కళ్ళిపాటు కార్యక్రమము, మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉట్లమాను ఉత్పవము నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. 

పంచలోహ ఉత్సవ విగ్రహం బహుకరణ

ముత్యాలమ్మ తిరుణాలను పురస్కరించుకుని కోసువారిపల్లె సమీపంలో ని పటపరెడ్డిగారిపల్లెకు చెందిన పుల్లారెడ్డి కుటుంబ సభ్యులు సుమారు రూ.1.50లక్షలు విలువ చేసే పంచలోహ ముత్యాలమ్మ ఉత్సవ విగ్రహాన్ని శనివారం రాత్రి ఆలయానికి బహుకరించారు.  

ములకలచెరువులో: మండలంలోని బురకాయలకోట సమీపంలో వెలసిన  ముత్యాలమ్మ తిరుణాల ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభ మయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకము, ప్రత్యేక పూజలు చేపట్టారు.  బురకాయలకోట, వేపూరికోట, మద్దినాయనిపల్లె తదితర గ్రా మాల మహిళలు బోణాలు మోసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు.   భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.  

 మల్లమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభం

బి.కొత్తకోట మే 15 : ప్రఖ్యాత పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో గల ఏనుగు మల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.   మొదటి రోజు ఆదివారం ఆలయంలో అమ్మ వారికి సుప్రభాత సేవ, గణపతి పూజ, అభిషేక పూజలు నిర్వహించారు. రాత్రి గజ వాహనంపై అమ్మ వారి ఊరేగింపు ఉత్సవం అత్యంత వైభవంగా  జరిగింది. కార్యక్ర మంలో ఆలయ కమిటీ ప్రతినిధులు స్థానికులు, పర్యాటకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  బి.కొత్తకోట నగర పంచాయతీలోని జను పు వీదిలో వెలసిన గంగా కామాక్షి అమ్మవారి గంగ జాతర ఉత్సవాలు సాదుచెట్టి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యా యి. ఆలయంలో అమ్మ  వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలు మంగళవారం వరకు జరుగుతాయన్నారు.



Updated Date - 2022-05-16T05:35:25+05:30 IST