నల్లమల పిలుస్తోంది

ABN , First Publish Date - 2021-07-30T04:52:16+05:30 IST

వర్షాలు కురుస్తుండటంతో నల్లమల పచ్చగా మారింది.

నల్లమల పిలుస్తోంది
ఆక్టోపస్‌ వ్యూ పాయింట్‌ వద్ద నల్లమల, కృష్ణమ్మ అందాలు

- కళకళలాడుతున్న అభయారణ్యం

- జలపాతాలతో కొత్త అందం

- శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెరిగిన సందర్శకులు


అచ్చంపేట/మహబూబ్‌నగర్‌ స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ (ఆంధ్రజ్యోతి) :  వర్షాలు కురుస్తుండటంతో నల్లమల పచ్చగా మారింది. ఈ నెల మొదటి వారం నుంచి విస్తా రంగా వర్షాలు కురవడంతో, మైదాన ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 6,545 చదరపు కిలోమీటర్ల మేర నల్లమల విస్త రించి ఉన్నది. జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం క్షే త్రానికి వెళ్లాలంటే నల్లమల అటవీ ప్రాంతం నుంచే ప్రయాణం చేయాలి. అచ్చంపేట మండ లం రంగాపూర్‌ సమీపంలోని మూల మలుపు నుంచి మొదలుకొని అమ్రాబాద్‌, వలువర్లపల్లి, దోమలపెంట మీదుగా దాదాపు 70 కిలోమీటర్ల ఘాట్‌ రోడ్డులో ప్రయాణం చేసి, శ్రీశైలం చేరుకో వాలి. మార్గమధ్యలో రోడ్డుకు ఇరువైపులా దట్టమై న అరణ్యం, అక్కడక్కడా ఎదురయ్యే వన్య ప్రా ణులు పర్యాటకులు, భక్తులను కనువిందు చేస్తా యి. ఘాట్‌ రోడ్డు ప్రారంభంలో మన్ననూర్‌లో ఉన్న చెంచులక్ష్మి మ్యూజియం చెంచుల జీవన స్థితిగతులను తెలియజేసే విధంగా ఉంటుంది. ఇ క్కడ తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ని ర్మించిన కాటేజీలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పం చుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో, బుధవారం నుంచి గేట్లు తెరు చుకున్నాయి. గురువారం పది గేట్లను ఎత్తడంతో దిగువకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఈ దృశ్యాలను చూసేందుకు నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగుళాంబ గద్వాల, పాలమూరు, నారాయణపే ట జిల్లాల నుంచే కాకుండా రంగారెడ్డి, హైదరా బాద్‌, పూర్వపు నల్లగొండ జిల్లా, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు వేలాదిగా తరలి వస్తున్నారు.


ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం

శ్రీశైలానికి ఉత్తర ద్వారం గా ఉమమహేశ్వరం పిలువబడు తోంది. హైదరాబాద్‌ నుంచి ఈ క్షే త్రానికి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్‌ నుంచి ఎన్‌ హెచ్‌-44 మీదుగా జడ్చర్ల వయా కల్వకుర్తి లే దా జడ్చర్ల నుంచి వయా నాగర్‌కర్నూల్‌ మీదుగా అచ్చంపేటకు చేరుకోవాలి. అక్కడి నుంచి ఎనిమిది కి లోమీటర్లు ప్రయాణించి రంగాపూర్‌ చేరుకొని, నాలుగు కి లోమీటర్లు ఉన్న ఘాట్‌ రోడ్డు మీదుగా ఉమామహేశ్వరం ఆలయానికి చేరకోవచ్చు. మరో మార్గం నుంచి హైదరాబా ద్‌-శ్రీశైలం జాతీయ రహదారి 765 మీదుగా ఆమనగల్లు వయా డిండి నుంచి నేరుగా ఉమామహేశ్వరానికి చేరుకో వచ్చు. ఇక్కడ కొండల నుంచి జలపాతం పారుతుంది.


మల్లెలతీర్థం జలపాతం

హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారి 765 మీదు గా ఈ జలపాతం వద్దకు చేరుకోవచ్చు. ముందుగా అ మ్రాబాద్‌ మండలం వటువర్లపల్లి గ్రామానికి చేరకో వాలి. అక్కడి నుంచి అటవీ ప్రాంతం మీదుగా ఎని మిది కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇక్కడి వరకు వాహనాలు వెళ్తాయి. అక్కడి నుంచి గుండం కిందకు మెట్ల మార్గాన వెళితే జలపాతం దర్శనమిస్తుంది.


ఆక్టోపస్‌ ఆకారంలో కృష్ణమ్మ

వటువర్లపల్లి నుంచి దోమలపెంట వెళ్లే మా ర్గంలో అక్టోపస్‌ వ్యూ పాయింట్‌ ఉంది. జాతీ య రహదారి 765 మీదుగా చేరుకొని, అక్కడి నుంచి అర కిలోమీటర్‌ అటవీ మార్గంలో ప్ర యాణించాలి. ఇక్కడికి వాహనాల అనుమతి ఉంది. ఈ పాయింట్‌ వద్దకు చేరుకోగానే అల్లం త దూరం వరకు కృష్ణమ్మ కనువిందు చేస్తుం ది. ఎత్తైన నల్లమల కొండల మధ్య నదీ మొ త్తం ఆక్టోపస్‌ ఆకారంలో ఉంటుంది. 


అక్కమహాదేవి గుహలు

అక్కమహాదేవి గుహల వద్దకు చేరుకోవడా నికి ముందుకు ఈగలపెంట వద్ద ఉన్న పా తాళగంగ వద్దకు చేరుకోవాలి. అక్కడి నుంచి బోటులో 13 కిలోమీటర్లు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ప్రయాణించాలి. అక్కడి నుంచి నదిని ఆనుకొని ఉన్న ఎత్తైన గుట్ట మీదకు నడుచుకుంటూ వె ళ్లాలి. దాదాపు కిలోమీటర్‌ ప్రయాణం చేస్తే అ క్కమహాదేవి గుహలు కనిపిస్తాయి.



Updated Date - 2021-07-30T04:52:16+05:30 IST