చెన్నూరులో రజాకార్ల పాలన సాగుతోంది: నల్లాల ఓదెలు

ABN , First Publish Date - 2022-05-22T20:19:34+05:30 IST

చెన్నూరులో రజాకార్ల పాలన సాగుతోందని కాంగ్రెస్‌ నేత నల్లాల ఓదెలు దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

చెన్నూరులో రజాకార్ల పాలన సాగుతోంది: నల్లాల ఓదెలు

హైదరాబాద్: చెన్నూరులో రజాకార్ల పాలన సాగుతోందని కాంగ్రెస్‌ నేత నల్లాల ఓదెలు దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ గూండాలతో పాలిస్తున్నారని ఆరోపించారు. ఇన్నాళ్లూ చాలా ఓపిక పట్టా.. ఇక సహించేది లేదని హెచ్చరించారు. ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చిన పార్టీ టీఆర్‌ఎస్‌ అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులకు టీఆర్‌ఎస్‌లో గౌరవం లేదన్నారు. బాల్క సుమన్‌కు దమ్ముంటే రాజీనామా చేసి... తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. త్వరలో తన సత్తా ఏంటో చూపిస్తానని నల్లాల ఓదెలు స్పష్టం చేశారు.

Updated Date - 2022-05-22T20:19:34+05:30 IST