Abn logo
Nov 26 2021 @ 10:45AM

Nallagonda: రేణుక ఎల్లమ్మ ఆలయంలో హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు

నల్లగొండ: జిల్లాలోని కనగల్లు మండలం చిన్న మాధారంలో గల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో దొంగతనం జరిగింది. ఆలయం గేటు తాళం పగులగొట్టిన మరీ దుండగులు హుండీని ఎత్తుకెళ్లారు. గడిచిన రెండు రోజులుగా ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ హుండీ ఆదాయం లెక్కించాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగతనంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇవి కూడా చదవండిImage Caption