Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 30 Dec 2021 00:54:07 IST

నల్లగొండ దరిద్రం పోవాలి

twitter-iconwatsapp-iconfb-icon
నల్లగొండ దరిద్రం పోవాలినల్లగొండ క్లాక్‌టవర్‌ సెంటర్‌లోని ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ కార్యాలయ పరిశీలకు వెళుతున్న సీఎం కేసీఆర్‌, చిత్రంలో మంత్రులు జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ పీజే పాటిల్‌, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

నీలగిరిని సిద్దిపేట మాదిరి తీర్చిదిద్దాలి 

మునిసిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు 

జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, మాల్స్‌ ఏర్పాటు

ఎన్జీ కళాశాల నిర్మాణానికి రెండురోజుల్లో జీవో 

నల్లగొండ కలెక్టరేట్‌ సమీక్షలో సీఎం కేసీఆర్‌ 

నల్లగొండలో సీఎం సుడిగాలి పర్యటన



నల్లగొండ : నల్లగొండకు దశాబ్ధాలుగా పట్టిన దారిద్య్రం పోవాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొం డ మునిసిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి సాధించాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని స్పష్టం చేశారు. నల్లగొండ పట్టణానికి బుధవారం వచ్చిన ఆయన నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించి అభివృద్ధి పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గడియారం సెంటర్‌లో ఉన్న ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ కార్యాలయాలను సందర్శించారు. 


నల్లగొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ తండ్రి మారయ్య పెద్దకర్మకు జిల్లాకేంద్రానికి వచ్చిన ఆయన జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలోని మునిసిపాలిటీలన్నింటికీ ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామన్నారు. మునిసిపాలిటీలో రోడ్లను అభివృద్ధిచేసి, జంక్షన్లను ఏర్పాటుచేసి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ జనాభాను అనుసరించి పట్టణం ఇరువైపులా వైకుంఠధామాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకేంద్రంలో వెజ్‌, నాన్‌వెజ్‌ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు అన్నీ ఒకేచోట లభించేలా మాల్స్‌ ఏర్పాటుచేయాలని సీఎం సూచించారు. పార్కుల అభివృద్ధికోసం చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ల్యాండ్‌ పూలింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఉదయ సముద్రం వద్ద ట్యాంక్‌బండ్‌, పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూ పొందించాలని, పట్టణంలో టౌన్‌హాల్‌ను అభివృద్ధిపరచాలన్నారు. మెడికల్‌ కళాశాలతోపాటు నర్సింగ్‌ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. హెలీప్యాడ్‌ స్థలాలను గుర్తించాలని, గజ్వేల్‌, సిద్దిపేట తరహాలో పట్టణాలను అభివృద్ధి చేయాలన్నారు. లోవోల్టేజీ సమస్య లేకుండా ఎస్పీసీడీఎల్‌ఎ్‌సను ఆదేశించారు. ఎన్జీ కళాశాల భవన నిర్మాణానికి రెండు రోజుల్లో జీవో జారీ చేస్తామని, నందికొండ, హాలియాలో అభివృద్ధి పనులు చేపట్టాలని, ఇతర మునిసిపాలిటీల్లో అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి ప్రణాళికను రూపొందించాలన్నారు. ఈ నెల 31వ తేదీన రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు ఇతర మంత్రులు పర్యటిస్తారని, అభివృద్ధిపై అధికారులతో చర్చిస్తారన్నారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తిచేయాలన్నారు. 


మరో 15 రోజుల్లో నల్లగొండకు వస్తా

నల్లగొండ పట్టణానికి మరో 15రోజుల్లో వస్తానని సీఎం కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మునిసిపాలిటీని కూడా అభివృద్ధిచేయాలన్నారు. నల్లగొండ పట్టణాన్ని అన్ని హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాల్గొని అక్కడే స్థిరపడి దశాబ్ధాలుగా జీవనం కొనసాగిస్తున్న అర్హులైన కుటుంబాలకు ఇళ్లు, ఇంటి క్వార్టర్లు, స్థలాలకు పట్టాలిచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొని, అక్కడే నివాసం ఏర్పర్చుకున్న కాలనీవాసులతోపాటు నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో ప్రాజెక్టుల కింద లబ్ధి దారులకు పట్టాలిచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమస్యల పరిష్కారంకోసం ఎదురు చూస్తున్న వారికి శాశ్వత పట్టాలు కల్పించాలన్నారు. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్‌ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఫోన్‌లో ఆదేశించారు. సాగర్‌ ప్రాజెక్టు ప్రాంతాల్లో కాలనీవాసులకు ఇచ్చిన హామీమేరకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం క ట్టుబడి ఉందన్నారు. ఎన్నికల కోడ్‌ తొలగిపోయినందున నిబంధనల మేరకు పట్టాలు మంజూరు చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ నల్లగొండలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. సమీక్ష అనంతరం గడియారం సెంటర్‌లో ఉన్న ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ కార్యాలయాలను సందర్శించారు. టౌన్‌హాల్‌ నిర్మాణానికి నడిబొడ్డున ఉన్న ఈస్థలం అనువుగా ఉంటుందా అని అధికారులను అడిగారు. సమీక్ష సమావేశంలో మంత్రులు హరీ ష్‌రావు, జగదీ్‌షరెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, రాజ్యసభ సభ్యులు సంతో్‌షకుమార్‌, బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్‌, రమావత్‌ రవీంద్రనాయక్‌, నల్లమోతు భాస్కర్‌రావు, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, ఎస్పీ రెమా రాజేశ్వరి, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు. 


మునిసిపల్‌ అధికారులపై సీఎం ఆగ్రహం 

 నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నల్లగొండ మునిసిపల్‌ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టరేట్‌లో సమీక్ష సందర్భంగా నల్లగొండలో పలు అభివృద్ధి పనులు వేగవంతం కాకపోవడానికి మునిసిపల్‌ అధికారులే కారణమని గుర్తించిన సీఎం అధికారులపై మండిపడినట్లు విశ్వసనీయ సమాచారం. నల్లగొండలో రోడ్ల పరిస్థితి, ఇతర వివరాలను మునిసిపాలిటీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులను సీఎం అడిగిన సందర్భంగా సదరు అధికారులు నీళ్లు నమలడం సీఎంకు కోపం తెప్పించింది. తక్షణమే వీరిని బదిలీ చేయడమే కాకుండా వారిస్థానంలో కొత్త టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్లను తీసుకోవాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌కు సూచించినట్లు వినికిడి. నల్లగొండను నందనవనంగా మార్చడంకోసం సిద్దిపేట అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన రమణాచారిని నల్లగొండ మునిసిపాలిటీకి కొత్త కమిషనర్‌గా నియమిస్తున్నట్లు సీఎం స్పష్టంచేశారు. ఇదిలా ఉంటే రమణాచారి సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించడంతో పాటు వేగవంతంగా పనులు పూర్తిచేసినట్లు సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నల్లగొండ మునిసిపాలిటీకి రమణాచారిని కమిషనర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


31న నల్లగొండకు మంత్రి కేటీఆర్‌ 

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

నల్లగొండ: ఈ నెల 31వ తేదీన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, జగదీ్‌షరెడ్డిలు నల్లగొండలో పర్యటించనున్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. మంత్రులు పాతబస్తీలో కూడా పర్యటించనున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ కలెక్టరేట్‌లో బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష సందర్భంగా కేటీఆర్‌తోపాటు మిగతా మంత్రులను నల్లగొండలో పర్యటించాలని ఆదేశించారు. శుక్రవారం మంత్రులు పట్టణంలో రెండు ఇంటిగ్రేటెడ్‌ సూపర్‌ మార్కెట్లకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా పానగల్‌ రిజర్వాయర్‌ వద్ద పార్కు, మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణంతోపాటు శిల్ప కళాతోరణం మాదిరిగా నిర్మాణాలను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. రూ.36కోట్లతో నూతన డిగ్రీ కళాశాల భవన నిర్మాణం, రోడ్ల వెడల్పు, నూతన టౌన్‌హాల్‌ నిర్మాణం నల్లగొండను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక ఆధారంగా కార్యక్రమాలను చేపట్టడంతోపాటు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు.  


ఎమ్మెల్యే కిషోర్‌ తండ్రి మారయ్యకు సీఎం నివాళి

నల్లగొండ/నల్లగొండ క్రైం: ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ తండ్రి మారయ్య దశదిన కర్మకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. జిల్లాకేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే నివాసానికి సీఎం కేసీఆర్‌ వెళ్లి మారయ్య చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కిషోర్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు. సీఎం పర్యటన నేపథ్యంలో నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. సీఎంవెంట మంత్రులు హరీ్‌షరావు, జగదీ్‌షరెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, శాసన మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎంపీలు జోగినపల్లి సంతో్‌షకుమార్‌, బడుగుల లింగయ్యయాదవ్‌, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, సూర్యాపేట జడ్పీ చైర్మన్‌ గుజ్జ దీపిక యుగేంధర్‌రావు, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భాస్కర్‌రావు, నోముల భగత్‌, శానంపూడి సైదిరెడ్డి, రవీంద్రకుమార్‌, రైతుబంధు సమన్వయ సమితి చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎంసీ కోటిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, చాడ కిషన్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్‌, వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎస్పీ రెమా రాజేశ్వరి, నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, వనమాల చంద్రశేఖర్‌, నల్లగొండ మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వైస్‌చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, టీఆర్‌ఎస్‌ జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పాశంరాంరెడ్డి తదితరులు ఉన్నారు.


మీరు మరి కొంతకాలం జిల్లాలోనే పని చేయండి

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌కు సీఎం అభినందన 

నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించినట్లు సమాచారం. సమీక్ష సందర్భంగా కలెక్టర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. మిమ్మల్ని ఇప్పట్లో బదిలీ చేయం, ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లాలన్న ఆలోచన కూడా మీరు చేయవద్దు.., మీరు మరికొంత కాలం జిల్లాలోనే పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. జిల్లా సమగ్రాభివృద్ధిలో కలెక్టర్‌గా ఎంతగానో కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలను వేగవంతంగా అమలు చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. కలెక్టర్‌ ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ పథకాలను వారికి చేరవేస్తున్నారని, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.