నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు స్వల్పంగా పెరిగిన వరద

ABN , First Publish Date - 2021-10-19T13:36:36+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. దీంతో అధికారులు నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు స్వల్పంగా పెరిగిన వరద

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. దీంతో అధికారులు నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 84,020 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిల్వ 311.7462 టీఎంసీలుగా కొనసాగుతోంది. 


Updated Date - 2021-10-19T13:36:36+05:30 IST