నల్లగొండ: మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 4,680 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 5,548 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. మూసీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి సామర్థ్యం 3.87 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 642.70 అడుగులుగా ఉంది.