Nallagonda: నాగార్జుసాగర్ ప్రాజెక్ట్ 6 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-01T13:31:11+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 6 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 63,080 క్యూసెక్కులుగా ఉండగా,

Nallagonda: నాగార్జుసాగర్ ప్రాజెక్ట్ 6 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 6 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 63,080 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో : 90,563 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం: 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం: 589.90 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 312.450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ: 311.74 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-10-01T13:31:11+05:30 IST