Abn logo
Sep 18 2021 @ 10:14AM

బ్లాక్ మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్: Gutta

నల్గొండ: బ్లాక్ మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రేవంత్ నోటికి అడ్డూ అదుపూ లేదని, బండి సంజయ్, రేవంత్‌లు వీధి రౌడీలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తే తెలంగాణ దోపిడీకి గురవుతుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీకి సంబంధమే లేదని, సెప్టెంబర్17ను బీజేపీ ఆట వస్తువులాగా ఆడుకుంటుందని విమర్శించారు. బీజేపీ నేతలు తెలంగాణలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని గుత్త సుఖేందర్ రెడ్డి యెద్దేవా చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption