Abn logo
Sep 19 2021 @ 10:51AM

Nalgonda: లారీని ఢీకొన్న కారు..నలుగురు దుర్మరణం

నల్గొండ: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు వద్ద జాతీయ రహదారి వద్ద ఆగివున్న లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కామినేని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ముత్యాలమ్మ గూడెం సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ఇవి కూడా చదవండిImage Caption