TRS ప్రభుత్వం తెలంగాణలో అరాచక పాలన కొనసాగిస్తోంది: UP MP

ABN , First Publish Date - 2022-07-01T21:08:39+05:30 IST

టీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్‌తో చేతులు కలిపి తెలంగాణలో అరాచక పాలన కొనసాగిస్తోందని...

TRS ప్రభుత్వం తెలంగాణలో అరాచక పాలన కొనసాగిస్తోంది: UP MP

నల్గొండ (Nalgonda) జిల్లా: టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Govt.) మజ్లిస్‌తో చేతులు కలిపి తెలంగాణ (Telangana)లో అరాచక పాలన కొనసాగిస్తోందని ఉత్తర ప్రదేశ్ (UP) ఎంపీ సుధాన్షు త్రివేది (Sudhanshu Trivedi) విమర్శించారు. శుక్రవారం నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో.. తెలంగాణలో పెట్రోల్ ధరల్లో చాలా వ్యత్యాసం ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రజలపై భారం పడకుండా రాష్ట్రం వాట పన్ను తగ్గించి పెట్రోల్‌ను ప్రజలకు అందిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో అయుష్మాన్ భారత్ ప్రవేశపెడితే తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు వైద్యం అందకుండా చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే అభివృద్ధి జరుగుతోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని ఎంపీ సుధాన్షు త్రివేది అన్నారు.


కాగా హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆ పార్టీకి అత్యంత కీలకం కానుంది. హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది, ఈ తరుణంలో నాలుగు నెలలకు ఓసారి జరగాల్సిన ఈ సమావేశానికి..  ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌ వేదికైంది. జాతీయ కార్యవర్గ సభ్యులు 80 మందితో పాటుగా ఆహ్వానితులు, శాశ్వత ఆహ్వానితులు, ఆఫీస్‌ బేరర్లు, పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రకారం ఉన్న 40 రాష్ట్ర కమిటీ అధ్యక్షులు, 33 రాష్ట్రాల పార్టీ శాసనసభా పక్ష నేతలు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులు తదితర 352 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. తొలి రోజున 40 మంది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తమ రాష్ట్రాల్లోని రాజకీయ, ఇతర పరిస్థితులపైన నివేదికలను సమర్పించనున్నారు. 

Updated Date - 2022-07-01T21:08:39+05:30 IST