నక్సల్స్ కంటే ప్రమాదకరం

ABN , First Publish Date - 2021-12-04T10:04:21+05:30 IST

గిరగిరా తిరుగుతూ నింగి నుంచి నేలకు జారితే ఎలా ఉంటుంది? వింటుంటే ఒళ్లంతా చెమటలు పట్టేయడం లేదూ...

నక్సల్స్ కంటే ప్రమాదకరం

క్రైస్తవ మిషనరీలపై బీజేపీ ఎంపీ గోమతి సాయి వ్యాఖ్య

గిరగిరా తిరుగుతూ నింగి నుంచి నేలకు జారితే ఎలా ఉంటుంది? వింటుంటే ఒళ్లంతా చెమటలు పట్టేయడం లేదూ? కెబె కీత్‌ ఎడ్వర్డ్‌ స్నైడర్‌కు మాత్రం అదో ఆటవిడుపు! ఎంచక్కా గాల్లో తేలినట్లుంటుంది! అమెరికాకు చెందిన స్కైసర్ఫర్‌ స్నైడర్‌.. 13,500 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం నుంచి దూకేశాడు. కాళ్లకి సర్ఫింగ్‌ బోర్డును మాత్రమే తగిలించుకుని గాల్లో గింగిరాలు తిరుగుతూ 8500 అడుగుల కిందకి జారిపోయాడు. 160 సార్లు గిరగిరా తిరుగుతూ సురక్షితంగా నేలపై దిగాడు. ఈ సాహసకృత్యంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్స్‌లోకి ఎక్కాడు.  


న్యూఢిల్లీ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌లోని గిరిజనులను క్రైస్తవంలోకి మారుస్తున్న మిషనరీలు నక్సల్స్‌ కంటే ప్రమాదకరమని రాయ్‌గఢ్‌ బీజేపీ ఎంపీ గోమతి సాయి తాజాగా వ్యాఖ్యానించారు. ఛత్తీ్‌సగఢ్‌లో మతమార్పిళ్ల సమస్యను లోక్‌సభలో జీరో అవర్‌ సందర్భంగా ఆమె లేవనెత్తారు. ఇది కేవలం మతమార్పిళ్లకు మాత్రమే పరిమితం కాదని, దేశ భద్రతకు సంబంధించిన అంశమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన స్వస్థ లం జష్‌పూర్‌ చాలా ఏళ్లుగా మతమార్పిళ్లతో ఇ బ్బందిపడుతోందని స్పష్టం చేశారు. వాటిని అరికట్టేందుకు ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాలని ఆమె కోరారు. ఇక.. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సంస్థల డైరెక్టర్ల పదవీకాల పొడిగింపునకు గతంలో చేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో ది సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌(సవరణ) అనే రెండు బిల్లులను కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలకు వ్యతిరేకమని, కేవలం ప్రతిపక్షాలను వేధించడం కోసమే ఈ బిల్లులను ప్రవేశపెట్టారని కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు.. ఆనకట్ట భద్రత బిల్లు సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని, దాన్ని సెలెక్ట్‌ కమిటీకి నివేదించాలని పలువురు ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభలో డిమాండ్‌ చేశారు. మరోవైపు.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రైలు టికెట్లపై రాయితీ ఇవ్వడం సాధ్యం కాదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ శుక్రవారం రాజ్యసభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 37 న్యాయమూర్తుల పోస్టుల్లో ప్రస్తుతం 19 పోస్టు లు ఖాళీగా ఉన్నాయని రిజిజు తెలిపారు. వాటిలో 10 శాశ్వత న్యాయమూర్తుల పోస్టులు, 9 అదనపు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణలో 42 జడ్జిల పోస్టులకు 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. 

Updated Date - 2021-12-04T10:04:21+05:30 IST