సీఎం ఆశయం ముందు నక్కజిత్తులు పనిచేయవు

ABN , First Publish Date - 2022-05-22T05:16:08+05:30 IST

సీఎం కేసీఆర్‌ ఆశయం ముందు ప్రత్యర్థుల నక్కజిత్తులు పనిచేయవని రాష్ట్ర షీప్‌, గోట్‌ డెవలప్‌మెంట్‌ (గొర్రెలు, మేకల) కార్పొరేషన్‌ చైర్మన్‌ బాలరాజుయాదవ్‌ పేర్కొన్నారు.

సీఎం ఆశయం ముందు నక్కజిత్తులు పనిచేయవు
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న బాలరాజుయాదవ్‌

- రాష్ట్ర షిప్‌, గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బాలరాజుయాదవ్‌


కల్వకుర్తి, మే 21: సీఎం కేసీఆర్‌ ఆశయం ముందు ప్రత్యర్థుల నక్కజిత్తులు పనిచేయవని రాష్ట్ర షీప్‌, గోట్‌ డెవలప్‌మెంట్‌ (గొర్రెలు, మేకల) కార్పొరేషన్‌ చైర్మన్‌ బాలరాజుయాదవ్‌ పేర్కొన్నారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో జరుగుతున్న దారుణాలపై సీఎం కేసీ ఆర్‌ యుద్ధం ప్రకటించాడని, ఆ యుద్ధం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అసమర్థత కేంద్ర ప్రభుత్వంపై జరుగుతున్న పోరాటంలో టీఆర్‌ఎస్‌ క్రియాశీల పాత్ర పోషించే సమయం ఆసన్నమైందని, కేసీఆర్‌ ఏ కార్యం తలపెట్టినా తెలంగాణ సమాజం అండగా నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యుత్‌ కోతలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 24గంటల విద్యు త్‌ అందిస్తున్నట్లు బాలరాజుయాదవ్‌ పేర్కొన్నారు. గొర్రెల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు లాల్‌యాదవ్‌, తిరుపతయ్యయాదవ్‌, వ్యవసాయ మార్కెట్‌ డైరెక్టర్‌ తిరుపతయ్య, రుక్మయ్యయాదవ్‌, లక్ష్మయ్యయాదవ్‌, ప్రదీప్‌యాదవ్‌, అంజియాదవ్‌, లక్ష్మయ్య, పాండు, శ్రీని వాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

 సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ఊర్కొండ : కేసీఆర్‌ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రజలందరి అభివృద్ధికి తోడ్పా టునిస్తోందని రాష్ట్ర షీప్‌, గోట్‌ డెవలప్‌మెంట్‌ (గొర్రెలు, మేకల) కార్పొరేషన్‌ చైర్మన్‌ డా.దూది మెట్ల బాలరాజుయాదవ్‌ అన్నారు. శనివారం మండలంలోని ఊర్కొండపేట అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆయన ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన వెంట కల్వకుర్తి సీఐ ఆవుల సైదులు, ఎస్సై కావలిరాజు, కౌన్సిలర్‌ నూనేయాదమ్మ, నాయకులు శ్రీనివాస్‌యాదవ్‌, తిరుపతయ్యయాదవ్‌, రుక్కయ్యయాదవ్‌ తదితరులున్నారు.  

Updated Date - 2022-05-22T05:16:08+05:30 IST