Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన నక్కా ఆనంద్‌బాబు

గుంటూరు: తుఫాన్ ప్రభావం వల్ల దెబ్బతిన్న పంట పొలాలను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పరిశీలించారు. వేమూరు మండలం, జంపని, బూతుమల్లి, చంపాడు గ్రామాల్లో దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మొన్న కురిసిన భారీ వర్షాలకు వరి మొత్తం 50 శాతానికిపైగా దెబ్బతిందన్నారు. ఇప్పుడు తుఫాను ప్రభావంతో మళ్లీ వర్షాలు పడితే మిగతా పంట కూడా రైతుల చేతికి వచ్చే పరిస్థితులు లేవని రైతుల ఆవేదన చెందుతున్నారన్నారు. వరుసగా వర్షాలు రావడం దురదృష్టకరమన్నారు. పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ముంచటానికి అప్పుడే వైసీపీ నాయకులు దళారి అవతారం ఎత్తుతున్నారని మండిపడ్డారు. రైతుల కోసం రూ. 3 వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న సీఎం జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. అధికారులు తక్షణమే పంట పొలాలు పరిశీలించి నష్ట నివారణ అంచన వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ డిమాండ్ చేశారు. టీడీపీ రైతులకు అండగా ఉండి వారి తరుపున పోరాటం చేస్తుందని ఆనందబాబు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement