నకిలీ విత్తనాల ప్రచారంపై ఎందుకు స్పందించరు ?

ABN , First Publish Date - 2021-10-20T03:15:50+05:30 IST

‘ఏపీ సీడ్స్‌ ద్వారా నకిలీ విత్తనాలు వస్తున్నాయని దుష్పప్రచారం జరుగుతుంటే, అధికారులుగా మీరేం చేస్తున్నారు దీనిపై

నకిలీ విత్తనాల ప్రచారంపై ఎందుకు స్పందించరు ?
ఏవోని ప్రశ్నిస్తున్న పేర్నాటి దంపతులు


-ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ పేర్నాటి సుస్మితారెడ్డి

కోట, అక్టోబరు 19 : ‘ఏపీ సీడ్స్‌ ద్వారా నకిలీ విత్తనాలు వస్తున్నాయని దుష్పప్రచారం జరుగుతుంటే, అధికారులుగా మీరేం చేస్తున్నారు దీనిపై స్పందించరా..?  గోదాములోకి ఏపీ సీడ్స్‌ సరఫరా జరగకముందే వచ్చినట్లు, రైతులు కొనుగోలుచేసి  అవి నకిలీ విత్తనాలుగా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంటే దీనిపై జవాబు చెప్పాల్సింది మీరే. దీన్నిబట్టి చూస్తే ప్రైవేట్‌ సీడ్స్‌ యాజమాన్యాలతో లోపా యికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లేనని తెలుస్తున్నది. ఇది మంచి పద్ధతికాదు. తక్షణం స్పందించండి’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ పేర్నాటి సుస్మితారెడ్డి, వైసీపీ రాష్ట్రకార్యదర్శి పేర్నాటి శ్యామ్‌ప్ర సాద్‌రెడ్డిలు వ్యవసాయాధికారులను ప్రశ్నలతో ముంచె త్తారు. ఈ సంఘటన మంగళవారం కోట మండలం గూడలి ఆర్‌బీకేలో జరిగింది. పేర్నాటి దంపతులు గూడలి ఆర్‌బీకేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్‌బీకేలో పలు విత్తనాలను తనిఖీ చేశారు. సహాయ వ్యవసాయాధికారు లకు పలు సూచనలు ఇచ్చారు. నాణ్యమైన విత్తనాలను సబ్సిడీ ధరలకు సరఫరా చేస్తున్నామని, దీనిపై ప్రతి రైతును చైతన్యపరచాలన్నారు. ఇకపోతే కొంతమంది నకిలీ విత్తనాలు వస్తున్నాయంటూ ప్రచారం చేయడం, అధికారులు దీనిపై స్పందించకపోవడం ఎట్టి పరిస్థితు ల్లోనూ సహించేది లేదన్నారు. ఆమె వెంట వ్యవసాయశాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శేఖర్‌బాబు, జిల్లా మేనేజర్‌ సరళ, తదితరులు ఉన్నారు. 


 ఖరీఫ్‌లో 7 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేశాం


 రాష్ట్రంలో 13 జిల్లాలో రైతులకు ఖరీఫ్‌లో అన్ని పంటలకు 7 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను రైతులకు సరఫరా చేశామని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శేఖర్‌బాబు అన్నారు. కోట మండలం గూడలి  ఆర్‌బీకేను ఆయనతోపాటు విత్తనాభి వృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ సుస్మితారెడ్డి, జిల్లా మేనేజర్‌ సరళలు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీలో మరో 3 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయనున్నారన్నారు.  విత్తనాల నాణ్యతకోసం ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లను కొత్తగా ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - 2021-10-20T03:15:50+05:30 IST