నెయిపాలిష్ వేసుకున్న తర్వాత బాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. నెయిల్‌పాలిష్ రిమూవర్ లేనిదే పాత రంగు పోదని.. బాధపడాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలో సులువుగా ఇలా తీసేయవచ్చు.
శానిటైజర్ చుక్కల్ని మెత్తటి క్లాత్ లేదా టిష్యూ పేపర్ లేదా దూదితో తీసుకోవాలి. గోళ్లమీద రుద్దితే రంగు మటుమాయం అవుతుంది.
టూత్‌పే్‌స్టను తుడిచేయాలనుకున్న గోటి రంగుపై రుద్దాలి. కాసేపటి తర్వాత టిష్యూ లేదా మెత్తటి గుడ్డతో రుద్దితే గోళ్లు శుభ్రంగా కనిపిస్తాయి.
పెర్ఫ్యూమ్‌తోనూ ఇలానే సులువుగా గోళ్లను శుభ్రపరచుకోవచ్చు.