AP News: పోలవరంపై వైసీపీది అనవసర రాద్దాంతం: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-08-20T01:32:58+05:30 IST

Amaravathi: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. వైసీపీ సర్కారు విధానాలపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ అండ్ కో అనవసర రాద్దాంతం చేస్తోందని విమర్శించారు.

AP News: పోలవరంపై వైసీపీది అనవసర రాద్దాంతం: చంద్రబాబు

Amaravathi: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Chandra Babu Naidu) సీఎం జగన్‌ (CM Jagan) పై విరుచుకుపడ్డారు. వైసీపీ(YSRCP) సర్కారు విధానాలపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ అండ్ కో అనవసర రాద్దాంతం చేస్తోందన్నారు.


నివేదిక వచ్చాక మాట మార్చారు..

‘పోలవరం ప్రాజెక్ట్‌ (Polavaram Project)ను వైసీపీ సర్కార్‌ నట్టేటముంచింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి టీడీపీయే కారణమని ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేశారు. వాల్ డ్యామేజీ వైసీపీ వైఫల్యమేనని పీపీఏ స్పష్టం చేయడంతో ఇప్పుడు కేంద్రాన్నే తప్పుబడుతున్నారు.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.   


ఏ కులంలో పేదరికం ఉంటే ఆ కులానికే నా ప్రాధాన్యం.

‘‘చేతకాని వాడే కులాల గురించి మాట్లాడతాడు. అన్ని కులాలు నా కులాలే. అనంతపురంలో కార్ల కంపెనీ కియాతో బడుగులకే ఎక్కువ లబ్ధి చేకూరింది. ఏ కులంలో పేదరికం ఉంటే ఆ కులానికే నా ప్రాధాన్యం. ఎవరైనా కుల రాజకీయాలు చేస్తే చెప్పు చూపించాలి. జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినవారిపై దాడులు చేస్తున్నారు. గౌరవంగా ఉండాల్సిన ఎంపీ గుడ్డలూడదీసుకొని తిరిగితే సీఎం సమర్థిస్తున్నారు. టీచర్లపై జగన్‌ ప్రభుత్వం కక్ష కట్టింది. టీచర్లను రిక్రూట్ చేయాల్సి వస్తుందనే స్కూళ్ల విలీనానికి తెరతీశారు. ఫలితంగా పేద విద్యార్థులకు స్కూళ్లను దూరం చేశారు.’’ అని వైసీపీ సర్కారుపై చంద్రబాబు మండిపడ్డారు. 

Updated Date - 2022-08-20T01:32:58+05:30 IST