ఠాకూర్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు
బద్వేలు, జనవరి24:నాయీబ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని నాయీబ్రాహ్మణ సేవాసంఘం రాష్ట్ర కార్యదర్శి కొలవళి వేణుగోపాల్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక త్యాగరాజు కాలనీలో దివంగత నేత కె.ఠాకూర్ 96వ జయంతి సందర్భం గా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ వెనుకబడిన బీసీ వర్గాలకు రిజర్వేషన్ లేని సమయంలోనే దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వెనుకబడిన బీసీలకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని ఆయన తెలిపారు. పేదనాయీబ్రాహ్మణ కులంలో పుట్టి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన గొప్ప నాయకుడు కస్తూరి ఠాకూర్ అని కొనియాడారు. కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు సుధా శేఖర్, పి.గురుస్వామి, వెంకటసుబ్బయ్య, సురేంద్ర, రమణ, తదితరులు పాల్గొన్నారు.