చాపకింద నీరులా ఒమైక్రాన్.. తాజాగా మరోటి!

ABN , First Publish Date - 2021-12-12T22:36:48+05:30 IST

దేశంలో కరోనా కేసులు చాపకింద నీరులా నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. ఈ ఉదయం కర్ణాటక, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్‌లో..

చాపకింద నీరులా ఒమైక్రాన్.. తాజాగా మరోటి!

నాగ్‌పూర్: దేశంలో కరోనా కేసులు చాపకింద నీరులా నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. ఈ ఉదయం కర్ణాటక, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు ఒమైక్రాన్ కేసులు నమోదు కాగా, తాజాగా నాగ్‌పూర్‌లో తొలి ఒమైక్రాన్ కేసు వెలుగు చూసింది. 40 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్ వేరియంట్ బారినపడినట్టు నాగ్‌పూర్ మునిసిపల్ కమిషనర్ రాధాకృష్ణన్ బి తెలిపారు.


బాధితుడు 8 రోజుల క్రితం పశ్చిమ ఆప్రికా నుంచి వచ్చినట్టు పేర్కొన్నారు. ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని, దీంతో నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు. అక్కడ ఆయన నుంచి నమూనాలు సేకరించి జినోమ్ సీక్సెన్సింగ్‌కు పంపగా ఒమైక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు. అతడిని కలిసిన వారికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగటివ్ వచ్చినట్టు తెలిపారు. తాజాగా కేసుతో కలుపుకుని మహారాష్ట్రలోని మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 18కి పెరిగింది.  


కర్ణాటకలో ఈ ఉదయం మూడో కేసు బయటపడింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమైక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది. అలాగే, చండీగఢ్‌లోనూ నేడు తొలి కేసు నమోదైంది. 20 ఏళ్ల ఇటలీ వ్యక్తికి ఒమైక్రాన్ సోకినట్టు తేలింది. ఇక, ఐర్లాండ్‌ను ఆంధ్రప్రదేశ్ వచ్చిన ఓ వ్యక్తికి తొలుత కొవిడ్ నిర్ధారణ కాగా, తాజాగా ఒమైక్రాన్ సోకినట్టు తేలింది. 

Updated Date - 2021-12-12T22:36:48+05:30 IST