Nagpur ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్‌పై డ్రోన్ల నిషేధం

ABN , First Publish Date - 2022-02-02T12:29:58+05:30 IST

నాగ్‌పూర్ నగరంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం, ఇతర ముఖ్యమైన కార్యాలయాలపై డ్రోన్‌లు ఎగురవేయడంపై నిషేధం విధించారు....

Nagpur ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్‌పై డ్రోన్ల నిషేధం

నాగ్‌పూర్(మహారాష్ట్ర): నాగ్‌పూర్ నగరంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం, ఇతర ముఖ్యమైన కార్యాలయాలపై డ్రోన్‌లు ఎగురవేయడంపై నిషేధం విధించారు. ఈ మేరకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 144 ప్రకారం నాగపూర్ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అశ్వతీ దోర్జే ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధాన్ని మంగళవారం మార్చి 31 వరకు పొడిగించినట్లు అధికారి తెలిపారు.నాగ్‌పూర్‌లోని మహల్ ప్రాంతంలో సంఘ్ బిల్డింగ్ రోడ్‌లో ఉన్న డాక్టర్ హెడ్గేవార్ భవన్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై డ్రోన్‌లు, రిమోట్ కంట్రోల్డ్, ఎయిర్‌క్రాఫ్ట్,ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్‌లు, పారా-గ్లైడర్‌లు, ఏరో మోడల్‌లు, పారాచూట్ సంబంధిత కార్యకలాపాలు 3 కిలోమీటర్ల పరిధిలో అనుమతించమని పోలీసులు పేర్కొన్నారు.


 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, హెడ్‌క్వార్టర్ మెయింటెనెన్స్ కమాండ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వాయుసేన నగర్, మహల్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి 2 కిలోమీటర్ల పరిధిలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, స్పెషల్ బ్రాంచ్ రాతపూర్వక అనుమతితో డ్రోన్లను ఎగురవేయవచ్చు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేస్తామని నాగపూర్ డీసీపీ హెచ్చరించారు.

Updated Date - 2022-02-02T12:29:58+05:30 IST