Nagpurలో 5రెట్లు డబ్బు వెదజల్లిన ఏటీఎం...రూ.500 విత్‌డ్రాకు యత్నిస్తే రూ.2500 పంపిణీ

ABN , First Publish Date - 2022-06-16T17:30:37+05:30 IST

అడిగిన దాని కంటే ఐదు రెట్లు అదనంగా కరెన్సీ నోట్లను వెదజల్లిన ఏటీఎం ఉదంతం...

Nagpurలో 5రెట్లు డబ్బు వెదజల్లిన ఏటీఎం...రూ.500 విత్‌డ్రాకు యత్నిస్తే రూ.2500 పంపిణీ

ఐదు రెట్ల నగదు పంపిణీతో బారులు తీరిన జనం...రంగప్రవేశం చేసిన పోలీసులు

నాగపూర్(మహారాష్ట్ర): అడిగిన దాని కంటే ఐదు రెట్లు కరెన్సీ నోట్లను వెదజల్లిన ఏటీఎం ఉదంతం మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా ఖపర్ ఖేడా పట్టణంలో తాజాగా వెలుగుచూసింది. నాగపూర్ జిల్లాలో ఓ వ్యక్తి ఏటీఎంలో 500రూపాయలు విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా ఐదు 500 కరెన్సీనోట్లు కలిపి మొత్తం రూ.2,500 లభించడంతో ఆశ్చర్యపోయాడు.నాగ్‌పూర్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖపర్‌ఖేడా పట్టణంలోని ఒక ప్రైవేట్ బ్యాంక్‌కు చెందిన ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ATM) వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో సదరు ఖాతాదారు మరిన్ని సార్లు ఏటీఎం నుంచి నగదును విత్ డ్రా చేశారు. ఐదురెట్లు నగదు పంపిణీ చేస్తున్న ఏటీఎం గురించిన వార్త దావానలంలా వ్యాపించడంతో వెంటనే నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎం వెలుపల పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు.


బ్యాంకు ఖాతాదారుల్లో ఒకరు స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, వారు ఏటీఎం వద్దకు వచ్చి మూసివేయించారు. పోలీసులు బ్యాంకుకు సమాచారం అందించారని ఖాపర్‌ఖేడా పోలీస్‌స్టేషన్‌ అధికారి తెలిపారు.ఏటీఎంలో సాంకేతిక లోపం కారణంగా అదనపు నగదు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 100 డినామినేషన్ నోట్లను పంపిణీ చేయడానికి ఉద్ధేశించిన ఏటీఎం ట్రేలో 500 డినామినేషన్ కరెన్సీ నోట్లను తప్పుగా ఉంచినట్లు బ్యాంకు అధికారి చెప్పారు.దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.


Updated Date - 2022-06-16T17:30:37+05:30 IST