సూర్యాపేట డీఎస్పీగా నాగభూషణం

ABN , First Publish Date - 2022-05-23T06:35:51+05:30 IST

సూర్యాపేట డీఎస్పీగా పి. నాగభూషణం నియమిస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు డీఎస్పీగా పనిచేసిన ఎస్‌.మోహన్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు.

సూర్యాపేట డీఎస్పీగా నాగభూషణం

సూర్యాపేటక్రైం, మే 22: సూర్యాపేట డీఎస్పీగా పి. నాగభూషణం నియమిస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు డీఎస్పీగా పనిచేసిన ఎస్‌.మోహన్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. కామారెడ్డి డీసీఆర్‌బీ డీఎస్పీగా పనిచేస్తున్న పి.నాగభూషణంను సూర్యాపేటకు బదిలీ చేశారు. మోహన్‌కుమార్‌ సూర్యాపేటలో రెండేళ్లకుపైగా డీఎస్పీగా విధులు నిర్వహించి మన్ననలు పొందారు. నూతనంగా నియామకమైన నాగభూషణం రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. అదే విధంగా కోదాడ డీఎస్పీ రఘు వరంగల్‌ జిల్లా తొ ర్రూరుకు బదిలీ అయ్యారు. కోదాడ డీఎస్పీగా ఇంకా ఎవరినీ నియమించలేదు.

Updated Date - 2022-05-23T06:35:51+05:30 IST