గురి కుదిరింది

ఇటీవల విడుదలైన ‘వరుడు కావలెను’ చిత్రంలో ప్రేమికుడిగా మెప్పించారు హీరో నాగశౌర్య. త్వరలోనే ఆయన తనలోని పోరాట యోధుణ్ణి ప్రేక్షకులకు పరిచయం చే సేందుకు సిద్ధమయ్యారు. నాగశౌర్య విలుకాడిగా నటించిన ‘లక్ష్య’ చిత్రం డిసెంబరు 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల తేదీతో కూడిన పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది. అందులో పలకల దేహంతో విల్లంబులు ధరించిన లుక్‌లో నాగశౌర్య ఆకట్టుకున్నారు. కేతికశర్మ కథానాయిక. జగపతిబాబు కీలకపాత్ర పోషించారు. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకుడు. నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌, పుస్కర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.

Advertisement