సెప్టెంబరుకల్లా నాగర్నార్‌ ప్లాంట్‌ విభజన పూర్తి

ABN , First Publish Date - 2021-04-12T05:53:15+05:30 IST

చత్తీ్‌సగఢ్‌లోని నాగర్నార్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న స్టీల్‌ ప్లాంట్‌ను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసే ప్రక్రియ సెప్టెంబరు నాటికి పూర్తవుతుందని ఎన్‌ఎండీసీ భావిస్తోంది...

సెప్టెంబరుకల్లా నాగర్నార్‌ ప్లాంట్‌ విభజన పూర్తి

న్యూఢిల్లీ: చత్తీ్‌సగఢ్‌లోని నాగర్నార్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న స్టీల్‌ ప్లాంట్‌ను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసే ప్రక్రియ సెప్టెంబరు నాటికి పూర్తవుతుందని ఎన్‌ఎండీసీ భావిస్తోంది. కేంద్ర కేబినెట్‌, కంపెనీ డైరెక్టర్ల బోర్డు గత ఏడాదే ఇందుకు ఆమోదం తెలిపాయి. ఇంకా సెబీ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉందని అధికార వర్గాలు చెప్పాయి. ఏటా 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో రూ.23,140 కోట్ల పెట్టుబడితో ఎన్‌ఎండీసీ ఈ సమగ్ర స్టీట్‌  ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-04-12T05:53:15+05:30 IST