Nagarjunasagar project: సాగర్‌కు తగ్గిన వరద

ABN , First Publish Date - 2022-08-19T02:09:47+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (Nagarjunasagar project) కు ఎగువ నుంచి వరద రాక తగ్గింది. దీంతో సాగర్‌ 18 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని

Nagarjunasagar project: సాగర్‌కు తగ్గిన వరద

నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (Nagarjunasagar project) కు ఎగువ నుంచి వరద రాక తగ్గింది. దీంతో సాగర్‌ 18 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project)కు కూడా వరద రాక తగ్గడంతో 7 క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి 1,94,932 క్యూసెక్కుల నీటిని, అలాగే రెండు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా 63,477 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో ఎగువనుంచి సాగర్‌కు మొత్తం 258409 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 584.50 అడుగులు(296.5580 టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి కుడి కాలువ ద్వారా 9019 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాలువ ద్వారా 8193 క్యూసెక్కుల నీటిని, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 29070 క్యూసెక్కుల నీటిని, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని, వరద కాలువ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని, మొత్తం 26 క్రస్ట్‌ గేట్లలో 18 క్రస్ట్‌ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,35,522 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 1,82,804 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా ఎగువ నుంచి 2,58,409 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతుంది.

Updated Date - 2022-08-19T02:09:47+05:30 IST