నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2021-10-08T13:29:05+05:30 IST
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతోఅ ధికారులు నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 76,589 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 80,047 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను...ప్రస్తుతం నీటి నిల్వ 311.4474 టీఎంసీలుగా నమోదు అయ్యింది.