నాగార్జునసాగర్ 18 క్రస్టు గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2020-09-29T13:19:18+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు 18 క్రస్టుగేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

నాగార్జునసాగర్ 18 క్రస్టు గేట్లు ఎత్తివేత

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు  వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు అయ్యింది.  పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరింది. 

Updated Date - 2020-09-29T13:19:18+05:30 IST