నాగార్జున‌సాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-09-20T15:11:25+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 16 క్రస్టుగేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

నాగార్జున‌సాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 16 క్రస్టుగేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 2,79,219 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ  309.0570 టీఎంసీలుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.00 అడుగులకు చేరింది. 

Updated Date - 2020-09-20T15:11:25+05:30 IST