సాగర్‌కు తగ్గిన వరద

ABN , First Publish Date - 2020-10-25T11:04:28+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు శనివారం ఎగువ నుంచి వరదరాక తగ్గింది. శ్రీశైలం నుంచి 190395 క్యూ సెక్కుల వరద రాగా, సాగర్‌ 10 గేట్లను 10 అడుగులమేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు

సాగర్‌కు తగ్గిన వరద

10 గేట్ల నుంచి నీటి విడుదల 


నాగార్జునసాగర్‌, చింతలపాలెం, కేతేపల్లి, అక్టో బరు 24: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు శనివారం ఎగువ నుంచి వరదరాక తగ్గింది. శ్రీశైలం నుంచి 190395 క్యూ సెక్కుల వరద రాగా, సాగర్‌ 10 గేట్లను 10 అడుగులమేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312. 0450 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 589.50 అడుగులు (310.5510 టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వకు 8680క్యూసెక్కులు, ఎడమకాల్వకు 6325, ప్రధా న జల విద్యుత్‌ కేంద్రం నుంచి 25050, ఎస్‌ఎల్‌బీసీ నుంచి 1200, పది క్రస్ట్‌గేట్ల నుంచి 149140, మొత్తం 190395 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


పులిచింతల ప్రాజెక్టుకు సాగర్‌ నుంచి 1,89,329 క్యూసెక్యుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175అడుగులు (45.77టీఎంసీలు) కాగా, ప్రస్తు తం 174.37అడుగులు(44.79టీఎంసీలు)గా ఉంది. ప్రాజె క్టు 8క్రస్ట్‌గేట్లను 2.5మీటర్లమేర ఎత్తిదిగువకు 1,75,070 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. శనివారం సాయంత్రానికి 7,752క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు రెండు క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు 5,144క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్ట 645అడుగులు కాగా,ప్రస్తుతం 643.10అడుగులుగా ఉంది.

Updated Date - 2020-10-25T11:04:28+05:30 IST