నాగార్జునసాగర్ 18 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2020-10-20T14:58:23+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొసాగుతుండటంతో అధికారులు 18 క్రస్ట్ గేట్స్ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్ 18 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొసాగుతుండటంతో అధికారులు 18 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్  ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో : 4,96,497 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 309.953 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 588.30 అడుగులకు చేరింది. 

Updated Date - 2020-10-20T14:58:23+05:30 IST