Nagarjuna Sagar Project‎కు తగ్గిన వరద ప్రవాహం

ABN , First Publish Date - 2021-10-18T13:21:12+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు గేట్లను మూసివేశారు. సాగర్ ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 58,130 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో: 48,908 క్యూసెక్కులుగా

Nagarjuna Sagar Project‎కు తగ్గిన వరద ప్రవాహం

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు గేట్లను మూసివేశారు. సాగర్ ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 58,130 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో  48,908 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.04250 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ 311.7462 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-10-18T13:21:12+05:30 IST