Nagarjuna Sagar: జెండా రంగులతో సాగర్ నీటి ప్రవాహం

ABN , First Publish Date - 2022-08-15T15:02:54+05:30 IST

నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టును విద్యుత్ కాంతులతో నింపారు.

Nagarjuna Sagar: జెండా రంగులతో సాగర్ నీటి ప్రవాహం

నల్లగొండ (Nalgonda): స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టును అధికారులు విద్యుత్ కాంతులతో నింపారు. 26 క్రష్ గేట్ల నుంచి విడుదలైన నీటి సోయగాలపై మువ్వన్నెల పతాకాన్ని తలపించే విధంగా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులను సాగర్ అందాలు అబ్బురపరుస్తున్నాయి. కాగా దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.


కాగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు  వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో: 3,10,868 క్యూసెక్కులుండగా, ఔట్ ఫ్లో: 3,34,242 క్యూసెక్కులుంది. నీటి సామర్థ్యం: 297/312 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం నీటిమట్టం: 584.90/ 590 అడుగులు ఉంది.

Updated Date - 2022-08-15T15:02:54+05:30 IST