నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద

ABN , First Publish Date - 2020-09-24T13:38:54+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. అధికారులు ప్రాజెక్ట్ 6 క్రస్టుగేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 1,33,533 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 309.9534 టీఎంసీలకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులుగా ఉంది. 

Updated Date - 2020-09-24T13:38:54+05:30 IST