నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి

ABN , First Publish Date - 2020-09-22T13:19:11+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 14 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 14 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 2,50,856 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరింది. 

Updated Date - 2020-09-22T13:19:11+05:30 IST