Abn logo
Aug 4 2021 @ 15:35PM

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద

గుంటూరు: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు 2 గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 80,942 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 50,113 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత 588.70 అడుగులు వరకు నీటిమట్టం ఉంది. సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు... కాగా ప్రస్తుతం 308.1702 టీఎంసీలు వరకు నీటి నిలువ ఉంది.