Oct 28 2021 @ 15:52PM

నాగార్జున ఒక్కరే ఎందుకు?

ఏపీ సీఎం జగన్‌తో హీరో నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్‌లో ఆయన్ను కలిశారు. నాగార్జునతోపాటు నిర్మాతలు నిరంజన్‌ రెడ్డి, ప్రీతం రెడ్డి, పలువురు నిర్మాతలు సీఎంను కలిసినట్లు సమాచారం. ఇండస్ట్రీ సమస్యలతోపాటు ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానంపై చర్చలు జరిపే అవకాశం ఉందని, దానికే తొలి ప్రాధాన్యం అని తెలస్తోంది. అయితే ఇండస్ర్టీ నుంచి ఇరు రాష్ట్రాల సీఎంలను కలవాలంటే పరిశ్రమకు చిరంజీవి, పలువురు దర్శకులు, బడా నిర్మాతలు వెళ్లేవారు. అయితే ఈసారి నాగార్జున కీలకంగా వెళ్లడం పట్ల చర్చకు దారి తీసింది. గతంలో సో కాల్డ్‌ పెద్దలు వెళ్లినా.. కొందరిని పక్కనపెట్టారని, చిన్న నిర్మాతలలో ఎలాంటి సంప్రదింపులు చేయడం లేదని కొందరు కామెంట్‌ చేసిన సంగతి తెలిసిందే!