Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 19 Aug 2022 12:13:17 IST

Bigboss 6 : నాగ్ పారితోషికం పెంచేశారా?

twitter-iconwatsapp-iconfb-icon

బిగ్‌బాస్ (Bigboss) తెలుగు సీజన్ 6‌కు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 4 నుంచి షో ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన ప్రోమోలు కొద్ది రోజులుగా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. గత మూడు సీజన్స్ నుంచి హోస్ట్‌గా అదరగొడుతున్న నాగార్జున (Nagarjuna).. ఆరో సీజన్‌కూ హోస్టింగ్ చేయనుండడం విశేషం. ఇప్పటి వరకూ 5 సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసుకొన్న ఈ హైయస్ట్ రేటెడ్ రియాలిటీ షో.. ఈ సీజన్‌ కోసం మరింత ఆకర్షణీయంగా వీక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సారి బిగ్‌బాస్ కోసం మరింత స్పైసీ నెస్ ను, వెరైటీ టాస్కులను రెడీ చేస్తున్నారు. నామినేషన్స్, ఎలిమినేషన్స్ ప్రోసెస్‌ను గత సీజన్స్ కన్నా వైవిధ్యంగా నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 కోసం నాగార్జున హోస్ట్‌గా తన పారితోషికాన్నీ ఓ రేంజ్‌లో పెంచేశారని సమాచారం అందుతోంది. 

బిగ్‌బాస్ సీజన్ 6 కు నాగ్ ఏకంగా రూ. 15 కోట్లు పారితోషికం అందుకుంటున్నారని టాక్. గత సీజన్స్ కోసం నాగార్జున రూ. 12 కోట్లు పారితోషికం అందుకోగా.. ఈ సీజన్‌కు మరో మూడు కోట్లను అదనంగా అందుకోనున్నట్టు వినికిడి. సీజన్ 3, 4, 5లను నాగ్.. ఎంతో సమర్ధవంతగా రక్తికట్టించారు. కంటెస్టెంట్స్‌తో ఆయన రిలేషన్ షిప్ వీక్షకుల్ని కూడా మెప్పించింది. అందుకే నాగార్జున డిమాండ్ చేసినంత ఇవ్వడానికి నిర్వహకులు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సీజన్ కోసం హౌస్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 

ఇక ‘బిగ్ బాస్ 6’ (Bigboss 6) కోసం కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ అయింది. యాంకర్ ఉదయభాను, యాక్టర్ అమరదీప్, ఆదిరెడ్డి, దీపికా పిల్లి, నేహా చౌదరి, శ్రీహాన్, చెలాకీ చంటి, గీతు రాయల్, కొరియోగ్రాఫర్ పాపీ మాస్టర్, శ్రీసత్య, ఆర్జే సూర్య ఇప్పటికే ఎంపికైనట్టు సమాచారం. గత సీజన్‌లో వీజె సన్ని విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఈ సీజన్ గత సీజన్స్ కన్నా ఎంత భిన్నంగా ఉండనుందో చూడాలి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement